Friday, January 17, 2014

23/01/2014 దాక క్షణం క్షణం టెన్షన్ టెన్షన్

                   రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే చరిత్రాత్మికమైన  అసెంబ్లి సమావేశములు  ఈ రోజు ప్రారంభమైనాయి. క్రికెట్టు ఆటలో చివరి బంతి పూర్తయ్యే వరకు జయాపజయములు తెలియవని ఇంకా చివరి బంతి మిగిలేవుందని ఓ నాయకుడు సెలవిచ్చరు.  కానీ చివరి బంతి వేసెదెవరొ,  బ్యాటింగ్ చెసేదెవరొ కానీ  రాష్ట్ర పరిస్తితులు నిశితముగా పరిశీలిస్తున్న వారికి మాత్రము  అనుక్షణం టెన్షనో టెన్షనుగా వుంది.  ఒక ప్రాంతము వారేమో కలిసేవుంటామంటారు   మరొక ప్రాంతము వారేమో తప్పక విడిపోతామంటారు.  రాజకీయ నాయకులంతా వారి వారి పార్టీలను ప్రక్కన పెట్టి  ప్రాంతాల వారిగా విడిపోయి వారి వారి ప్రాంతాలకు అనుకూలముగా మాట్లాడుతున్నారు.  కొన్ని ప్రాంతాలలో సమైక్య  రాష్ట్రం కోసం కొత్త రాజకీయ పార్టి  ఆవిర్భావిస్తున్నటు హోర్డింగులు వెలిశాయి.   చివరి బంతికి సిక్స్ కొడతారా లేక అవుట్ అవుతారో ?

                  రాష్ట్రములోని  సామాన్యుల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుపై ఆధారపడి వున్నది.  కావున శాసన సభలోని పెద్దలందరూ  సఘటు మనిషిని దృష్టిలో ఉంచుకొని  రాష్ట్రములోని అన్ని ప్రాంతముల వారికి మంచి జరిగేల నిర్ణయము తీసుకొనవలెను.   

Wednesday, January 1, 2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలుగు సోదర సోదరీమణులందరికి 
2014 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Wednesday, June 26, 2013

తెలంగాణ సమస్య త్వరగా తేల్చండి.

               తెలుగు వారమైన మనమంతా ఒకే  కుటుంబము.  నిజమే "కలసివుంటే కలదు సుఖము".  కాని మన సహోదరులు  కొందరు విడిపోతేనే వారు సంతోషముగా జీవించగలమని భావించుచున్నారు.  కలిసి అందరు సుఖముగా ఉండాలని ఇరువర్గములకు ఉండాలి.   కాని  ఒకరు విడిపోవాలని నిర్ణయించుకొని,  విడిపోవడానికోసము  పోరాటముచేస్తున్నారు.   అమాయకులైన  కొందరు విద్యార్థులు ఆత్మబలిదానము చేయుచున్నారు.   క్షణికావేశములో  వారి కుటుంబములను వారిని   నమ్ముకున్న వారిని అన్యాయము చేయుచున్నారు.  

                 ఇటువంటి  పరిస్తితులలో  ప్రతిదినము కొట్టుకుంటూ కలిసుండడము  కంటె  విడిపోయి సుఖముగా ఉండడమే ఉత్తమైనదని నా వ్యక్తిగత అభిప్రాయము.   అంతేకాక  ఈ  గొడవలతో  రాష్ట్ర అభివృద్ధికూడా  కుంటుబడుతున్నది.  అందువలన  తెలంగాణ సమస్య త్వరగా తేల్చండి.










Sunday, April 21, 2013

మహాత్మా మన్నించు

అయ్యా,
        మహాత్మా నీవు మన దేశములో మహిళలు అర్దరాత్రికూడా ఒంటరిగా తిరగగలిగే స్వేచ్చ స్వాతంత్రాలు ఉండాలని కలగన్నావు.   కాని మన దేశానికి స్వాతంత్ర్యము వచ్చి ఇన్ని సంవత్సరముల  తర్వాతకూడా, అదీ దేశ  రాజధాని అయిన డిల్లీ నగరములోనే మహిళలకు భద్త్రత కొరవడింది.  ఒక్క సారి కాదు పదే పదే మహిళలపై దౌర్జాన్యాలు పునరావృతమొఉతున్నాయి.  సభ్యసమాజము తలదించుకొనేలా  మహిళలపైనే కాదు చివరికి చిన్న పిల్లలపై కూడా అత్యాచారములు జరుగుచున్నాయి.   ప్రభుత్వము  కొత్త కొత్త చట్టములు చేసినాకూడా నిర్భయముగా ఇవి కొనసాగుతున్నాయంటే, లోపము ఎక్కడుంది.   భలమైన చట్టములు చేయలేని ప్రభుత్వంలోన,  ఉన్న చట్టాములను సమర్దవంతముగా అమలుచేయలేని అధికారులలోనా,  లేక  మన వ్యవస్థలోనే లోపముందా.
                       ఏదేమైనా  లోపము ఎక్కడవున్నా ప్రస్తుత పరిణామములు ప్రతి ఒక్కరూ ఖండించవలసినవి. మహాత్మా  మళ్ళ్  నీవు జన్మించవలసిన  సమయము అసన్నమైనది.