Wednesday, June 26, 2013

తెలంగాణ సమస్య త్వరగా తేల్చండి.

               తెలుగు వారమైన మనమంతా ఒకే  కుటుంబము.  నిజమే "కలసివుంటే కలదు సుఖము".  కాని మన సహోదరులు  కొందరు విడిపోతేనే వారు సంతోషముగా జీవించగలమని భావించుచున్నారు.  కలిసి అందరు సుఖముగా ఉండాలని ఇరువర్గములకు ఉండాలి.   కాని  ఒకరు విడిపోవాలని నిర్ణయించుకొని,  విడిపోవడానికోసము  పోరాటముచేస్తున్నారు.   అమాయకులైన  కొందరు విద్యార్థులు ఆత్మబలిదానము చేయుచున్నారు.   క్షణికావేశములో  వారి కుటుంబములను వారిని   నమ్ముకున్న వారిని అన్యాయము చేయుచున్నారు.  

                 ఇటువంటి  పరిస్తితులలో  ప్రతిదినము కొట్టుకుంటూ కలిసుండడము  కంటె  విడిపోయి సుఖముగా ఉండడమే ఉత్తమైనదని నా వ్యక్తిగత అభిప్రాయము.   అంతేకాక  ఈ  గొడవలతో  రాష్ట్ర అభివృద్ధికూడా  కుంటుబడుతున్నది.  అందువలన  తెలంగాణ సమస్య త్వరగా తేల్చండి.










Sunday, April 21, 2013

మహాత్మా మన్నించు

అయ్యా,
        మహాత్మా నీవు మన దేశములో మహిళలు అర్దరాత్రికూడా ఒంటరిగా తిరగగలిగే స్వేచ్చ స్వాతంత్రాలు ఉండాలని కలగన్నావు.   కాని మన దేశానికి స్వాతంత్ర్యము వచ్చి ఇన్ని సంవత్సరముల  తర్వాతకూడా, అదీ దేశ  రాజధాని అయిన డిల్లీ నగరములోనే మహిళలకు భద్త్రత కొరవడింది.  ఒక్క సారి కాదు పదే పదే మహిళలపై దౌర్జాన్యాలు పునరావృతమొఉతున్నాయి.  సభ్యసమాజము తలదించుకొనేలా  మహిళలపైనే కాదు చివరికి చిన్న పిల్లలపై కూడా అత్యాచారములు జరుగుచున్నాయి.   ప్రభుత్వము  కొత్త కొత్త చట్టములు చేసినాకూడా నిర్భయముగా ఇవి కొనసాగుతున్నాయంటే, లోపము ఎక్కడుంది.   భలమైన చట్టములు చేయలేని ప్రభుత్వంలోన,  ఉన్న చట్టాములను సమర్దవంతముగా అమలుచేయలేని అధికారులలోనా,  లేక  మన వ్యవస్థలోనే లోపముందా.
                       ఏదేమైనా  లోపము ఎక్కడవున్నా ప్రస్తుత పరిణామములు ప్రతి ఒక్కరూ ఖండించవలసినవి. మహాత్మా  మళ్ళ్  నీవు జన్మించవలసిన  సమయము అసన్నమైనది.